25-02-2025 08:43:07 PM
సత్తుపల్లి/కల్లూరు (విజయక్రాంతి): కోచింగ్ సెంటర్ లలో విద్యార్థులకు మెరుగైన ఉత్తమ బోధన అందించి ఉన్నత ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. స్థానిక నవ భారత్ టెక్నో కళాశాలలోని విజినరీ జూనియర్ లైన్మెన్ కోచింగ్ సెంటర్ లో మంగళవారం కోచింగ్ వాల్ పోస్టర్ ను అయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ఈ కోచింగ్ సెంటర్ ద్వారా తర్పీదు పొంది ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీపీఐ నాయకులు దండు ఆదినారాయణ, కోచింగ్ సెంటర్ యాజమాన్యం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.