calender_icon.png 31 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయి అధ్యయనాలతో మెరుగైన సేవలు

30-07-2024 02:13:24 AM

కేంద్ర సచివాలయ సెక్షన్ అధికారులతో సమావేశంలో డీఆర్‌డీవో కృష్ణన్ 

యాదాద్రి భువనగిరి, జూలై 29 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి అధ్యయనాలు ఎంతో మేలు చేస్తాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందిం చవచ్చని డీఆర్‌డీవో ఎంఏ కృష్ణన్ అన్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ సెక్షన్ అధికారులు జిల్లాలో శిక్షణ, గ్రామ సందర్శనకు వచ్చిన సందర్భంగా వారితో నిర్వహించిన సమావేశంలో డీఆర్‌డీవో మాట్లాడారు. కేంద్ర సర్వీసులకు చెందిన 24 మంది అధికారులు ఆగస్టు 2 వరకు జిల్లాలో గ్రామ సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

తుర్కపల్లి మండలం ధర్మా రం, రాజాపేట మండలం దూది వెంకటాపురం, యాదగిరిగుట్ట మండలం మల్లా పూర్, మోటకొండూరు మండలం వర్టూరు, రామన్నపేట మండలం ఇస్కిల్లలో అధికారులు పర్యటించనున్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో శోభారాణి, ఎంసీహెచ్‌ఆర్ ప్రతినిధి పీ వెంకటేశ్వర్లు, భూగర్భ జల అధికారి జ్యోతికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.