calender_icon.png 29 March, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మరింత మెరుగైన సేవలు

26-03-2025 06:17:16 PM

అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమర్థంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు విచారణ, త్రాగు, సాగు నీరు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతి, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వేగవంతంపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతి వారం సాగు నీటిపై మండల స్థాయిలో యాసంగి పంటకు నీటి నిర్వహణపై సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగి పంటకు నీటి నిర్వహణపై ప్రతి మండలంలో రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సాగునీటి పంటకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగునీరు సమస్య ఎక్కడ  వచ్చే అవకాశం ఉంటుందో నీటి పరిష్కారానికి రైతులను భాగస్వామ్యం చేసుకుంటూ అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో తీసుకోవాలని అన్నారు. రైతులకు నీటి షెడ్యూల్ పై సమాచారం అందించాలని అన్నారు.

పంటల సంరక్షణకు అధికారులు కృషి చేయాలని అన్నారు. సాగునీరు విషయమై వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, నీరు అందేలా చూడాలని అన్నారు. నీటి కాల్వల వద్ద నీటిని బ్లాక్ చేయకుండా చూడాలని, ఎక్కడైనా గేట్ బ్లాక్ చేస్తే వెంటనే అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన రేషన్ కార్డులు ధరఖాస్తులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, పంచాయతి, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.