calender_icon.png 18 October, 2024 | 5:56 PM

నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి..

18-10-2024 03:16:06 PM

హైదరాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి. కె హెచ్ఓడి లకు సూచించారు. శుక్రవారం కమిషనర్ అన్ని విభాగాల హెచ్ఓడీలతో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్  ఆయా విభాగాలు నిర్వహిస్తున్న  పనులు, కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల హెచ్ ఓ డి లు తమ తమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి కమీషనర్ కు వివరించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆయా విభాగాల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగరవ్యాప్తంగా చెత్త సేకరణ ప్రక్రియ మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా విభాగాల హెచ్ఓడి తమ అనుబంధ శాఖలతో రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీష్, నళిని పద్మావతి, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సామ్రాట్ అశోక్, యాదగిరిరావు, అలివేలు మంగతాయారు, సత్యనారాయణ, సరోజ, చీఫ్ ఇంజనీర్లు భాస్కర్ రెడ్డి, అనిల్ రాజ్, దేవానంద్, ఎస్ ఈ కోటేశ్వర్ రావు, సిసిపి శ్రీనివాస్, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్,  చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు