calender_icon.png 4 April, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి

02-04-2025 12:18:56 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మనోహరాబాద్, ఏప్రిల్ 1:ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం, మెరుగైన నిర్వహణకు గుర్తింపుగా నిలుస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  పేర్కొన్నారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మనోహరాబాద్ మండలం కేంద్రంలో కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్, మందులు నిల్వచేయి స్టోర్ రూమ్, పరిశీలించారు.

ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు, వసతులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారని తెలిపారు.

జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.