calender_icon.png 10 January, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన సేవలు అందించాలి

03-01-2025 01:12:27 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): గ్రేటర్ హైద రాబాద్ పరిధిలో కొత్త సంవత్సరంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూ చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మరింత సంకల్పంతో పనిచేయాలన్నారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల అధిపతులు గురువారం కమిషనర్ ఇలంబర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, సెక్రటరీ ఎంఏ ఖాదర్, నర్సింగ్‌రావు, డాక్టర్ కుమార్, డాక్టర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.