26-03-2025 12:30:53 AM
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ జీఎస్డీ ప్రసాద్
జహీరాబాద్‌లో బీవోఎం నూతన శాఖ ప్రారంభం
జహీరాబాద్, మార్చి 25 : స్థానిక ప్రజలకు మెరుగైన బ్యాంకు సేవలు అందించడంతోపాటు ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చడానికి కృషిచేస్తున్నామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ జీఎస్డీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో హైదరాబాద్ డిప్యూటీ జోనల్ మేనేజర్ కేఈ హరికృష్ణ, సిబ్బంది, కస్టమర్లతో కలిసి అత్యాధునిక బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బ్యాంకు ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 శాఖల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నదని పేర్కొన్నారు. జహీరాబాద్ శాఖ అన్ని బ్యాంకింగ్ సేవలను అందజేస్తుందని చెప్పారు. అనంతరం డిప్యూటీ జోనల్ మేనేజర్ కేఈ హరికృష్ణ మాట్లాడుతూ.. జహీరాబాద్లో తమ నూతన శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ ఏవీఎస్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.