- కెనరా క్రస్ట్‌ను సధ్వినియోగం చేసుకోవాలి
కెనరాబ్యాంక్ సీజీఎం చంద్రశేఖర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కెనరాబ్యాంక్ ఎం డీ, సీఈవో సత్యనారాయణరాజు ఆలోచన ల మేరకు కెనరా క్రెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆ బ్యాంక్ సీజీఎం చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం నిజామాబాద్‌లో కెనరా క్రెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్ నిజామాబాద్ పరిధిలోని బ్రాంచిల నుంచి 150 మంది ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీజీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కెనరా క్రెస్ట్ పథకాన్ని అందరూ సధ్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ బీ శ్రీనివా తదితరులు పాల్గొన్నారు.