ఓయూ వీసీ కుమార్ మొలుగారం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(విజయక్రాంతి): ప్రజల అవసరాలకు తగ్గట్లుగా సాంకేతికాభివృద్ధి జరిగినప్పుడే పరిశోధనల లక్ష్యం నెరవేరుతుందని ఉస్మానియాయూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ కుమార్ మొలుగారం అన్నారు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 12లక్షల మంది ఇంజనీర్లను విద్యాసంస్థలు తయారు చేస్తున్నాయని, వారిలో నైపుణ్యం కలిగిన 20శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భవిష్యత్‌లో మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డా.భానుప్రకాశ్‌రెడ్డి, ఈసీఐఎల్ శాస్త్రవేత్త డా.అనిశ్‌కుమార్, ఓయూ ఇంజనీరింగ్‌కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పి.చంద్రశేఖర్, ఈసీఐఎల్ విభాగాధిపతి ప్రొ.డీ రామకృష్ణ, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.