రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు8 (విజయక్రాంతి): జిల్లా కేంద్ర, మండల, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె భువనగిరిలోని ప్రభుత్వఆసుపత్రి, పోచంపల్లి పీహెచ్‌సీ, అంతారం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని డయా గ్నోస్ట్టిక్ హబ్, సీటీ స్కాన్ రూమ్, బయో కెమిస్ట్రీ, పాథలాజికల్ ల్యాబ్ పనితీరును పరిశీలించారు.
బ్లడ్ బ్యాంక్, డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటుకు అదనపు అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కలెక్టర్ హనుమంతు జండగే, అదనపు కలెక్టర్ గంగాధర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ పాల్గొన్నారు.