calender_icon.png 25 January, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

24-01-2025 07:35:29 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ ఆరోగ్య సమస్యలపై వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వలు, రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వారి ఆరోగ్య సమస్యలపై మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన ఔషధ నిల్వలు అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.