calender_icon.png 9 January, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్య సేవలు అందించాలి

09-01-2025 01:02:30 AM

వనపర్తి, జనవరి 8 ( విజయక్రాంతి ) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు.బుధవారం అయిజ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ జనరల్ వార్డ్,ఫార్మసీ, ల్యాబ్ వంటి విభాగాలను తనిఖీ చేసి, ఆసుపత్రి సేవలు, ప్రసవాల సంఖ్య, సీజనల్ వ్యాధుల నియంత్ర ణ, రిఫరల్ రిజిస్టర్, ప్రతిరోజు నమోదవుతున్న ఔట్‌పేషెంట్ల వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సమావేశమై రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

ఆసుపత్రి వసతులు, వైద్య పరికరాలను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇతర పరీక్షలను వేగంగా పూర్తి చేసి తక్షణ రోగనిర్ణయం చేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైతే గద్వాల జిల్లా ఆసుపత్రికి రిఫరల్ అందించాలని తెలిపారు.

ఔట్ పేషెంట్లకు సమగ్ర వైద్య సేవలు అందించడంతో పాటు, అన్ని చెక్‌అప్లు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో నీటి సమస్యతో పాటు చిన్న చిన్న  పనులన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలోని అదనపు 30 పడకల వార్డు నిర్మాణ పనులను పరిశీలించి, పెండింగ్ పనులపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు అందుబాటు లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, డి.ఎం.హె.ఓ సిద్దప్ప, డాక్టర్ విష్ణు, టి.ఎస్.ఏం.ఐ.డి.సి ఈ.ఈ జైపాల్ రెడ్డి, రహీముద్దీన్, ఆర్ అండ్ బీ ఈఈ ప్రగతి, కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.