calender_icon.png 18 November, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్య సేవలు అందించాలి

18-11-2024 02:54:30 AM

సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాత

ఇల్లెందు ఏరియా ఆసుపత్రి తనిఖీ

ఇల్లెందు, నవంబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లెందు ఏరియా ఆసుపత్రిని సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీ సుజాత ఆదివారం తనిఖీ చేశా రు. రోజువారీ ఓపీ వివరాలను, వార్డ్ రూమ్‌లను, అత్యవసర విభాగాన్ని, ఇన్ పేషంట్, మందుల వివరాలు, ఆక్సిజన్ మిషన్‌ల పనితీరును తనిఖీ చేశారు.

హాస్పిటల్‌లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారితో వైద్య సిబ్బంది ఆప్యా యంగా మాట్లాడాలని, మెరుగైన వైద్య సేవ లు అందించాలని సూచించారు. వైద్య సేవ లో ఎటువంటి అంతరాయం ఏర్పడినా కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆసుపత్రి పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమెవెంట ఏరియా జీఎం జాన్ ఆనంద్, సూపరింటెండెంట్ నరసింహరావు ఉన్నారు.