28-03-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా
ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): ప్రైవేట్ వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ అన్నారు. ఈ మేరకు గురువారం సిద్ధిక్ నగర్‌లో ఎస్‌ఆర్‌డి ఎన్జీవో సంస్థ, రెయిన్బో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన వెంటనే వైద్యాధి కారులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా దాదాపు 200 మందికి వైద్య పరీక్ష లు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో వైద్యాధికారి సింధు పాల్, భోలక్ పూర్ డివిజన్ బిఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, నాయకుడు పర్వేజ్ ఖురేషి, అజీజ్ పాషా, షకిల్ అహ్మద్, ఎస్‌ఆర్డి ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఇందిరా భారతి, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.