calender_icon.png 8 February, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..

07-02-2025 10:59:40 PM

రాంనగర్ లో సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పున: ప్రారంభం..

ఎమ్మెల్యే ముఠాగోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): పేదలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల మనల్ని పొందాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాంనగర్ లో డాక్టర్ ఎస్. రాజేశ్వరరావు స్థాపించిన ఆధునిక వసతులతో కూడిన సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ.. రాంనగర్ లో అత్యాధునిక  వసతులతో ఆధునిక సేవలు అందించేందుకు హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ సామన్ శ్రీనివాస్, డాక్టర్ సాహిత్య మేద, డాక్టర్ సౌమ్య సిందం, డాక్టర్ సంస్కార్, డాక్టర్ శ్రీ కిరణ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్. మోజెస్, ఖదీర్, నేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.