calender_icon.png 7 February, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

07-02-2025 12:00:00 AM

 నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్లగొండ మండలం రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. రిజిస్టర్లు, సౌకర్యాలు పరిశీలించి మాట్లాడారు. దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలని చెప్పారు.

పీహెచ్సీ స్టాఫ్నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు కొరత ఉందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే నియమిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తదితరులున్నారు.