10-04-2025 12:23:43 AM
ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్9 ( విజ యక్రాంతి):ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటిడిఎ పిఓ కుష్షుబు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు.బుధవారం రెబ్బెన మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాలను కుష్బూ గుప్తా ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు.
సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ సూచించారు. దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరి యా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. గోలేటి లోనిఆశ్రమ పాఠశాలలో ఆరో ప్లాంట్ పనిచేయందున పిల్లలు బోర్వెల్ నీళ్లు తాగడంపై ఆరా తీశారు.
మెనూ సక్రమంగా పాటించకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున బ్రేక్ ఫాస్ట్ స్నాక్స్ , మజ్జిగ అందించకపోవడం, శానిటేషన్ సక్రమంగా లేనందున ప్రధానోపాధ్యాయుడు రవీందర్, వార్డెన్ మోహన్ దాస్ కు సోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆసిఫాబాద్ లోని బాలుర ఆశ్రమ పాఠశాల లో మెనూ ప్రకారం వెజ్ బిర్యానీ పెట్టాల్సింది పెట్టనందున, ఎలాంటి అనుమతి లేకుండా విధుల కు గైర్హజారు అయిన ఆర్ రాజేశ్వర్‌కు సోకా జ్ నోటీసు జారీ చేశారు. వార్డెన్, డిప్యూటీ వార్డెన్ ,స్టాఫ్ సమయానికి అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహించారు.