calender_icon.png 31 October, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం

13-07-2024 04:58:30 AM

భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి, జూలై 12(విజయక్రాంతి):  గ్రీన్ ఫీల్డ్  నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు మెరుగైన పరిహరం అందించేందుకు కృషి చేస్తానని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన నిర్వాసిత రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధిలో రహదారులు ఎంతో కీలక ప్రాత పోషిస్తాయని, గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా కూడా అభివృద్ధి సాధిస్తుందన్నారు. రైతుల అభీష్టం మేరకే భూసేకరణ ప్రక్రియ చేపడతామన్నారు. జిల్లాలో 35 కిలోమీటర్ల మేర హైవే ఉంటుందని, రోడ్డు నిర్మాణానికి 45 మీటర్ల వెడల్పు భూమి మాత్రమే సేకరిస్తున్నామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్,  నేషనల్ హైవే ఈఈ మనోహర్ పాల్గొన్నారు.

భూములకు బదులు భూములివ్వాలి..

మంచిర్యాల, జూలై 12 (విజయక్రాంతి): జైపూర్ మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న బాధితులకు భూములకు బదులు భూములే ఇవ్వాలని నిర్వాసిత రైతులు శుక్రవారం కుమార్ దీపక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ కింద టేకుమట్ల, ఎల్కంటి, శెట్‌పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, కిష్టాపూర్, రుమ్మిపూర్, వేలాల, గోపాల్‌పూర్ రైతలు భూములు కోల్పోతున్నారన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా భూములకు బదులు భూమి కావాలని స్పష్టం చేశారు.