calender_icon.png 6 January, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన పరిహారం

04-01-2025 02:16:38 AM

ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో రైతుల పట్ల ఉదారత

  1. పంట పొలాలకు సులువుగా వెళ్లేలా ఎన్‌హెచ్‌లో అండర్ పాస్‌లు నిర్మించాలి
  2. మూడేండ్లలో హ్యామ్‌లో రహదారుల నిర్మాణం పూర్తి.. ఆర్‌ఆర్‌ఆర్‌పై సీఎం సమీక్ష

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించా లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు.

ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారుల భూసేకరణ, పరిహారం, హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో రహదారులు, రేడియల్ రోడ్ల  నిర్మాణాలపై సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఓఆర్‌ఆర్.. ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానం..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై.. ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. భూసేకరణను వేగవం తం చేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్ (దక్షిణ) భాగానికి ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందున.. హెచ్‌ఎండీఏతో అలైన్‌మెంట్ చేయించాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌ను కలిపే 11 రంహదారులకు ఆటంకం లేకుం డా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం.. పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండటంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

నాగ్‌పూర్‌విజయవాడ అనుసంధానం

రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా సాగే నాగ్‌పూర్ (ఎన్‌హెచ్ 163జీ) రహదారి, ఆర్మూర్ రహదారి (ఎన్‌హెచ్ 63), జగిత్యాల (ఎన్‌హెచ్ 563) రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీశాఖ ఎందుకు కొర్రీలు పెడుతుందని పీసీసీఎఫ్ డోబ్రియల్‌ను సీఎం రేవంత్ ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సీఎం ఆదేశించారు.

ఆర్ అండ్ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వారితో పది రోజులకు ఒకసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని, ఇక్కడ కాకపోతే ఆర్ అండ్ బీ, అటవీశాఖ మంత్రులు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమై అనుమతులు సాధించాలని సీఎం సూచించారు.

జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా.. నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల దూరం వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సీఎం సూచించారు.

హ్యామ్ విధానంలో..

రాష్ట్రంలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో ఆర్ అండ్ బీ పరిధిలో 12 వేల కి.మీ., పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17700 కి.మీ. రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు.

ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అనే తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ల తయారీ, రహదారుల నిర్మానం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించా లని అధికారులను సీఎం ఆదేశించారు.

మూడేండ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మ త్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,  ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీలు వీ శేషాద్రి, జీ చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు షానవాజ్ ఖాసీం, మాణిక్‌రాజ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు

  1. వెయ్యి కోట్లతో గ్రామీణ రహదారులు
  2. నెలకు రూ. 150 కోట్లు విడుదల
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 1000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేటాయించారు. ఈ రహదా రుల నిర్మాణానికి ఈనెల నుంచి నెలకు రూ. 150 కోట్ల చొప్పున జూన్ నెలాఖరునాటికి రూ. వేయి కోట్లు విడు దల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ లపై సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామీణ రహదారులకు సంబం ధించి సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కాలంలో ఎడ్లబండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగు ణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్ణ యించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం మారుమూల పల్లె ల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నాయని.. వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల కొలతలను పునఃనిర్వచించాల్సి ఉందని అన్నారు. ఆయా వాహనాలు ఆటంకం లేకుండా సాగిపోయేలా రహదారులు నిర్మించాలని ఆదేశించారు.

తండా లు, గూడేలను పంచాయతీలు చేసినా.. వాటికి రహదారులు, పంచాయతీ పాఠశాల భవనాల నిర్మాణాలను విస్మరించా లని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

బీటీ రోడ్డు లేని పంచాయతీ ఉండకూడదన్నారు. గ్రామాల నుంచి మండలాలకు సింగ్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంత లు పడిన రహదారులకు వెంటనే మరమ్మత్తులు ప్రారంభించాలని ముఖ్య మంత్రి అన్నారు.

పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయని.. ఇక ముందు అలా ఉండటానికి వీలు లేదన్నారు. రెండు శాఖల పరిధి లో ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి సూ చించారు.

వాహనదారులు తాము ప్రయాణించేది పీఆర్ రోడ్డా.. ఆర్ అండ్ బీ రోడ్డా అనే విషయాన్ని పట్టించుకోరని, కేవలం ప్రయాణం ఎలా సాగుతుందనేది ప్రధానమని ముఖ్యమంత్రి అన్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సీఎం ఆదేశించారు.