calender_icon.png 21 March, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ద్రోహం.. ఢిల్లీకి లాభం

21-03-2025 12:06:51 AM

బడ్జెట్‌పై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు ద్రోహం, ఢిల్లీకి లాభం అనేలా  ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్  కేటీఆర్ అభివర్ణించారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై ఉక్కు పాదం మోపారంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘జాబ్ క్యాలెండర్ లేదు.. కొత్త ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగభృతి రాదు’ అని విమర్శించారు.

అధికారం కోసం అశోక్ నగర్ గడపతొక్కారని.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల గొంతు నొక్కారని మండిపడ్డారు. న్యాయం కోసం నిలదీసిన దళిత రైతు వెంకటయ్యను అరెస్టు చేశారని.. అతడి అభిప్రాయం తీసుకున్న జర్నలిసులను జైలుకు పంపారని గుర్తుచేశారు.

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటి మీద దాడికి యత్నం చేయడాన్ని ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే దాడులు, జైలు అంటున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులు...కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులని కేటీఆర్ ఎద్దేవా చేశారు.