- ఈనెల 4 వరకు అధికారికంగా సాగనున్న జాతర
భక్తుల తాకిడితో జనసంద్రమైన జాతర ప్రాంగణం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా జరుగుతుంది. శనివారం ఆలయంలో బేతాల్ పూజలు నిర్వహించారు. దీంతో మెస్రం వం శీయులు సాంప్రదాయ పూజలు ముగిశా యి. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని జనవరి 28న అర్ధరాత్రి మహాపూజ తో నాగోబా జాతరను వారు ప్రారంభించిన విషయం తెలిసింది.
బేతాల్ పూజలలో భాగంగా ముందుగా సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవాడ ముఖదారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశ మహిళలు వంశ పెద్దల కాళ్లు కడిగి బేతాళ్ పూజలకు ఆహనించారు. మెస్రం వంశ పెద్దలు ఏడు గెనెల వెదురు కర్ర చేత పట్టుకొని బేతాల్ విన్యాసాలు చేశారు. మెస్రం మశీయులు, కొత్త కోడళ్లు సాంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం సతి దేవత, బాన్ దేవత ఆలయంలో కొత్త కోడళ్లు, భక్తులు వేసిన కానుకాలు, ప్యాలాలను 22 కితల వారిగా పంపిణీ చేశారు.
ఈ సారి సతిదేవత ఆలయం రూ.78,873 రూపాయలు వచ్చినట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఈ సందర్భంగా మహాపూజలకు తీసుకొచ్చిన కొత్త కుండలను కితల వారిగా మెస్రం వంశీయులకు పంపిణీ చేశారు.
కొత్త కుండలను అం దుకున్న మెస్రం వంశీయులకు సంవత్సర కాలం ఆ కుండలకు పూజలు చేయాలని సూచించారు. బేతాల్ విన్యాసాలతో నాగో బా సాంప్రదాయ పూజలను ముగించిన మెస్రం మశీయులు రాత్రి ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయానికి బయల్దేరి ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు.