calender_icon.png 19 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుండి బేతాళస్వామి ఉత్సవాలు

16-04-2025 07:06:28 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కోరిన కోర్కెలు తీర్చే బేతాళస్వామి ఉత్సవాలను ఏటా వేసవిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మొదటి బేతాళ స్వామి ఆలయం మెదక్ జిల్లా అల్లాదుర్గం కాగా రెండోది బాన్సువాడ కావడం విశేషం. పాత బాన్సువాడకు వెళ్లే దారిలో కొలువైన బేతాళస్వామి ఆలయ జాతర ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన, రెండో రోజు కుస్తీ పోటీలు, చివరి రోజైన మూడో రోజు జాతర ఉంటుంది.