calender_icon.png 13 October, 2024 | 12:53 AM

అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానం

09-10-2024 12:00:00 AM

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నేడు దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును మలయాళ చిత్రం ఆట్టం గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా కాంతారా చిత్రానికి రిషబ్ శెట్టి అవార్డు ను అందుకున్నారు.

ఉత్తమ నటిగా తిరుచిత్రంబళం చిత్రా నికి గానూ నిత్యా మీనన్, కచ్ ఎక్స్‌ప్రెస్ చిత్రానికి గానూ మానసి పరేఖ్ అవార్డును అందుకున్నారు. ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.

ఉత్తమ దర్శకు డిగా సూరజ్ బర్జాత్య, ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘పొన్ని యన్ సెల్వన్ 1’కు ఏఆర్ రెహ్మాన్ జాతీయ అవార్డు అం దుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా అవార్డు లను అందుకున్నారు. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్, ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి నటనకు గానూ ప్రత్యేక ప్రస్తావన అవార్డును అందుకున్నారు.