- నీరుగారిపోతున్న‘బీఏఎస్’ లక్ష్యం
- గతేడాది రూ.80 కోట్లు, ఈసారి రూ.130 కోట్లు పెండింగ్
- ప్రభుత్వం నిధులు ఇవ్వాలని యాజమాన్యాల డిమాండ్
- ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిళ్లు
- ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యా ర్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకొని ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్) అమ లవుతున్నది. కానీ, ప్రభుత్వాలు సకాలంలో యాజమాన్యాలకు నిధులు విడుదల చేయకపోవడంతో పథకం లక్ష్యంగా నీరుగారి పోతున్నది. నిధులు పెండింగ్‌లో ఉండ డం తో ప్రైవేటు యాజమాన్యాలు వెంటనే ఫీజు లు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో స్కూళ్ల నిర్వహణ భారంగా ఉందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పథకానికి సంబంధించి గతేడాది రూ. 80 కోట్లు, ఈ ఏడాది రూ.130 కోట్ల నిధు లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది పేద విద్యార్థుల చదు వు ప్రశ్నార్థకంగా మారింది.
వేల మంది లబ్ధిదారులు..
విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభు త్వ భాగస్వా మ్యంతో రాష్ట్రప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తు న్నది. పథ కం ద్వారా ఆర్థికంగా, సామాజికం గా, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గానికి చెందిన 18 వేల మంది, ఎస్టీ వర్గానికి చెందిన 7 వేల మంది విద్యార్థులకు పథ కం వర్తిస్తున్నది.
పథకం నిబంధనల ప్రకా రం విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. సర్కార్ వరుసగా రెండేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడం తో లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు పథకానికి ఎంపికైన విద్యార్థులకు చదువు చెప్పేందుకు ససేమీరా అంటున్నాయి. సిబ్బందికి వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితిలేదని స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులకు వసతి, భోజనం కల్పిం చలేకపోతున్నామని తేల్చిచెప్తున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత ఫీజులు చెల్లిస్తేనే వారికి తరగతులు కొనసాగిస్తామని ప్రకటించే యోచనలో ఉన్నాయి.
ఉమ్మడి పాలనలో షురూ..
రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం వర్తించే స్కూళ్లు 150 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీవర్గానికి చెందిన విద్యార్థులు డే స్కాలర్ అయితే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.28 వేలు, హాస్టల్ విద్యార్థులయితే రూ.42,000 చొప్పున ప్రభు త్వం చెల్లించాల్సి ఉన్నది. పథకం 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైంది. తొలి విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రైవేటు స్కూళ్లను ఎంపికి చేసింది. తొలి ఏడాది 8 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు మాత్రమే చదువుకునేందుకు అవకాశం కలిగింది. అప్పుడు డే స్కాలర్‌కు ఏడాదికి రూ.8 వేలు, హాస్టల్‌లో ఉండి చదివే విద్యార్థికి రూ.20 వేల చొప్పున సర్కార్ యాజమాన్యాలకు చెల్లించేది.
తెలంగాణ సిద్ధించిన తర్వాత ఇలా..
తెలంగాణ సిద్ధించిన తర్వాత నాటి ప్రభు త్వం బీఏఎస్ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 150 ప్రైవేటు స్కూళ్లను ఎంపిక చేసింది. దీంతో 25వేల మంది పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు అవకాశం కలిగింది. 2023 విద్యాసంవత్సరంలో రూ.130 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండగా, గత ప్ర భుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. మి గతా రూ.80 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం ప్రభు త్వం మారింది. మళ్లీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మరో రూ. 130 కోట్లు యాజమాన్యాలకు అందించాల్సి ఉన్నది.
బకాయిలు విడుదల చేయాలి
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో ఉచితంగా చదువుకునేందుకే బెస్ట్ అవైలబుల్ స్కీం వచ్చింది. వారికి సంబంధించిన ఫీజులను సర్కార్ పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదు. యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే బీఏఎస్ పథకం అమలులోకి వచ్చింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సజావుగా చదువుకోలేకపోతున్నారు. వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడనుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.
టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి