calender_icon.png 21 October, 2024 | 9:26 AM

ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌తో బెస్ట్ ట్రీట్ మెంట్!

26-08-2024 12:30:00 AM

కష్టతరమైన వెన్నెముక శస్త్ర చికిత్సలకు స్టార్  హాస్పిటల్స్ అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నూ త న సదుపాయం రోగులకు అధునాతన వెన్నెము క శస్త్రచికిత్సలను డే-కేర్ విధానాలుగా చేయగలుగుతుంది. దీని ద్వారా అధిక- రిస్క్ ఉన్నవారు, వృ ద్ధులు త్వరగా కోలుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు, జీవనశైలి, పెరుగుతున్న ఊబకాయం కారణంగా చాలామంది వీపు, వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఫలితంగా చాలామంది తాత్కాలిక నొప్పి నివారణ కోసం స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించే నొప్పి నివారణ మందులు, ఖరీదైన ఫిజియోథెరపీ సెషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వె న్నెముక సమస్యలు చాలా సాధారణం. అయినప్పటికీ తీవ్రమైన నొప్పి, నరాలు దెబ్బతినడం, వా టి పనితీరు కోల్పోయే వరకు ప్రభావం చూపుతూ నే ఉంటుంది. శారీరక శ్రమను తక్కువ చే స్తాయి. ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కార ణం మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన లేకపోవడమే. స్టార్ హాస్పిటల్స్ అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని అందుబాటు లోకి తీసుకురావడం వల్ల మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ద్వారా ఇది శరీరానికి తక్కువ గాయంతో పాటు వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది.

స్టార్ హాస్పిటల్  83 ఏళ్ల వేమారెడ్డికి ఈ శస్త్రచికిత్స ద్వారా అడ్వానస్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంట ర్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడారు. “నేను ఎంతోకాలంగా ఈ నొప్పితో బాధపడుతున్నా. ఎక్కడా తగ్గకపోవడంతో ఆరోగ్యంపై ఆశలు వదిలేశా. ఒకసారి స్టార్ హాస్పిటల్స్‌లో వెన్నుముక శస్త్రచికిత్స కోసం స్నేహితుడి ద్వారా డాక్టర్ విశ్వక్ సేనరెడ్డిని సంప్రదించా. ఆయన నాకు కొండంత నమ్మకం కలిగించారు. ఆ తర్వాత శస్త్రచికిత్సకు అంగీకరించా. ట్రీట్‌మెంట్ చేసుకున్న కొద్దిరోజుల్లోనే నొప్పి నెమ్మదిగా తగ్గడంతో ఆశ్చర్యపోయా‘ అని చెప్పారు.

ప్రముఖ వెన్నుముక శస్త్రవైద్యుడు డాక్టర్ విశ్వక్ సేనరెడ్డి అవగాహన ప్రాముఖ్యతను తెలియజేశా రు. ‘నా రోగుల్లో చాలామంది శస్త్రచికిత్స తర్వాత వెంటనే నడుస్తున్నారు. ఎండోస్కోపిక్ విధానాల ప్రయోజనం అదే. ఇది రోజువారీ శస్త్రచికిత్సలుగా సులభంగా చేయొవచ్చు. ఇవి భారతదేశంలో కొ న్ని కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న అత్యాధునిక శస్త్రచికిత్సలలో ఒకటి. ఈ చికిత్స ఎ న్నుకోవడం గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం, తద్వారా చాలామంది వెన్నుముక సమస్యలకు మెరుగైన వైద్య పరిష్కారాలను పొందగలరు.

స్టార్ హాస్పిటల్స్‌లోని అధునాతన ఎం డోస్కోపిక్ స్పైన్ సెంటర్ సరికొత్త ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి అధునాతన వెన్నెముక సంరక్షణను అందిస్తుంది.   స్టార్ హాస్పిటల్స్ న్యూరోసర్జరీ, స్పెషలైజ్డ్ కేర్ లో అగ్రగామిగా ఉంది. మా నూతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ కేవలం  వైద్యం ద్వారా రక్షించడమే కాకుండా జీవితాలను మెరుగుపరచడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో రోగుల సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మాకు గర్వకారణం” అని చెప్పారాయన.

ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ముఖ్య ప్రయోజనాలు

  1. మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ఫలితంగా శరీరానికి తక్కువ గాయం.
  2. వేగవంతమైన రికవరీ, రోగులు శస్త్రచికిత్స తర్వాత 2 నుంచి 3 గంటలలోపు నడవడానికి వీలు ఉంటుంది.
  3. రోగులు త్వరగా తమ సాధారణ జీవితాలకు తిరిగి పొందవచ్చు.

స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేకతలు

  1. హార్ట్ & మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ
  2. ఆర్థోపెడిక్స్ & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ
  3. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ
  4. న్యూరాలజీ & ఎండోస్కోపిక్ స్పున్ సెంటర్
  5. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ & క్రిటికల్ కేర్
  6. కిడ్నీ కేర్ & రీనల్  ట్రాన్స్‌ప్లాంటేషన్
  7. గ్యాస్ట్రో ఎంటరాలజీ & ఇన్వాసివ్ జీఐ సర్జరీ
  8. లేయం, హెచ్‌పీబీ & కాలేయ మార్పిడి
  9. క్యాన్సర్, హెమటాలజీ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్
  10. 24/7 ఎమర్జెన్సీ & ట్రామా కేర్

డాక్టర్ పి. విశ్వక్ సేనారెడ్డి

  1. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ (న్యూరోసర్జరీ)
  2. ఫెలో ఇన్ న్యూరో ఎండోస్కోపీ, బ్రెయిన్ సర్జరీ, 
  3. స్పైన్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జరీ