calender_icon.png 16 January, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవీంద్ర భారతీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం

05-09-2024 06:15:42 PM

హైదరాబాద్: రవీంద్ర భారతీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా విభాగంలో ఉత్తమ అధ్యాపకులగా 41 మందిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. వర్సిటీ, అనుబంధ కళాశాలల అధ్యాపకులకు అవార్డులను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో అదర్శమైన గురువులు ఉన్నరని  డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను మన గురువులు చక్కగా అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు చక్కగా సహకరించారని డిప్యూటీ సీఎం తెలిపారు. గురువులు ఎంత గొప్ప వాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందన్నారు. సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో గురువులదీ కీలకపాత్ర అని భట్టి పేర్కొన్నారు.

గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను వారికి కలిపిందని, ఎదురుచూసిన బదీలను, టీచర్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. డీఎస్సీ నిర్వహించి టీచర్ల కొరతను కూడా పరిష్కరించనున్నామని, కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లకు వేతనాలు కూడా అందలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.137 కోట్లు వెచ్చించామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేకపోయారని రాష్ట్ర విద్యార్థులు అంతర్జతీయంగా పోటీ పడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందన్నారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ లేదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.