calender_icon.png 22 December, 2024 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. అధికారులను తప్పుదోవ పట్టించారు

11-09-2024 08:09:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినందున చర్యలు తీసుకోవాలని కోరుతూ పిడిఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ వ్యాపారంలో పలువురు ఉపాధ్యాయులు ఉండడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు విద్యాశాఖ అధికారి 150 మందికి ఉత్త ఉపాధ్యాయ అవార్డులను అందించి అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు