calender_icon.png 13 February, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీసేవ కేంద్రాల ద్వారా ఉత్తమ సేవలు

13-02-2025 12:00:00 AM

ఈడియం సందీప్ 

మెదక్, ఫిబ్రవరి 12(విజయ క్రాంతి): మీసేవ కేంద్రాల ద్వారా పౌరులకు ఉత్తమ సేవలు అందాలని  ఈ.డి.యం  సందీప్ తెలిపారు. జిల్లాలో మీసేవ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం జిల్లాలోని మీసేవ కేంద్రాలను ఈడియం సందీప్  ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పౌరులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ  కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని మీసేవ కేంద్రాలను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేయడం జరిగిందని, పౌరులు దగ్గర అదనపు చార్జీలు వసూలు చేయకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించడం జరిగింది అన్నారు. మీసేవ కేంద్ర సేవలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని వివరించినట్లు చెప్పారు.  కార్యాలయ సిబ్బంది శశికాంత్ పాల్గొన్నారు