10 June, 2026 | 4:45 AM

ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ ఫలితాలు

10-06-2026 12:58 AM

నేరేడుచర్ల, జూన్ 9 : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల, ఉపాధ్యాయ బృందం నేరేడుచర్ల పురపాలిక ఆవాస ప్రాంతాల్లో బడిబాట ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల కరపత్రాలతో తల్లిదండ్రులకు  అవగాహన కల్పిస్తూ  నిర్వహించారు.

ఈ సందర్బంగా మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ షాహిన్న్, ఇంజమూరి వెంకటమ్మలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 6 గురు మెరిట్ సాధించి ఎంపిక అవడం గర్వకారణం అని, ప్రభుత్వ పాఠశాలలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బోధన,ఉత్తమ ఫలితాలు సాధిస్తుండడం ,   విద్యార్థుల కోసం ప్రభుత్వాలు  కల్పిస్తున్న వసతులు సదుపాయాలను సద్వినియోగపరుచుకొనేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన ఉపాధ్యాయులు బట్టు. మధు, ఉపాధ్యాయులు  ఎం. సైదులు బి బికోజి ,టి రామ్మూర్తి, ఎం బాలు, పి శ్రీను, స్థానికులు మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.