calender_icon.png 27 November, 2024 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయిలో రాష్ట్రానికి ఉత్తమ గుర్తింపు తీసుకురావాలి

27-11-2024 04:14:39 PM

జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ 

పాపన్నపేట: జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఘనపరిచి జాతీయస్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ సూచించారు. గత రెండు రోజులుగా మెదక్ పట్టణంలోని పిఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి 68వ ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయస్థాయికి విద్యార్థులను అదేవిధంగా రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాట్మెంటన్ విభాగంలో రాష్ట్ర స్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రానికి ఉన్నత స్థాయిలో ఉంచేలా అత్యుత్తమ ప్రదర్శన చేయాలన్నారు.

జాతీయస్థాయికి ఎంపిక కాని విద్యార్థులు సైతం విద్యార్థులు సైతం తదుపరి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చూపించేలా తమ నైపుణ్యం మెరుగుపరచుకోవాలని సూచించారు... జాతీయ స్థాయికి బాలుర విభాగం లో ప్రథమ స్థానం శివాన్ష్ అబు (హైదరాబాద్ )ద్వితీయ స్థానం లో సాయి హర్షికేత్ బటరాజ్ (రంగారెడ్డి ) మూడవ స్థానం పి రవికిశోర్ (రంగారెడ్డి ), నాలుగవ స్థానం లో విజయ్ బర్మావత్ (రంగారెడ్డి ), ఐదవ స్థానం లో ధృవ్ సింగ్ (హైదరాబాద్ ), బాలికల విభాగం లో ప్రథమ స్థానం జి. కునాలిక (రంగారెడ్డి), ద్వితీయ స్థానం లో యశిక (రంగారెడ్డి ) మూడవ స్థానం డి దీప్తి (హైదరాబాద్ ), నాలుగవ స్థానం లో ఆవేద్య (ఆదిలాబాద్), ఐదవ స్థానం లో నిత్య  (ఖమ్మం )లు ఎంపికయ్యారు.. వీరు త్వరలో ఢిల్లీ లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు సత్యారావు నాగరాజు శ్రీనివాసరావు వినోద్ కుమార్, రిఫరీలు మధు, బక్షి శివశంకర్, కుర్షిద్ రవి, మణిరం తో పాటు తదితరులు పాల్గొన్నారు.