calender_icon.png 19 March, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గారేపల్లి వాసికి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు..

18-03-2025 04:49:46 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి వాసికి ముంబైలో బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు దక్కింది. మంగళవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ మొట్టమొదటి ఐపిఎస్ అధికారిని, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ, ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ సైన నెహ్వాల్ చేతుల మీదుగా సుంకరి శ్రీధర్ పటేల్ బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు తీసుకున్నారు. సుంకరి శ్రీధర్ గత కొన్ని సంవత్సరాలుగా పూణేలో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. శ్రీధర్ కు అవార్డు రావడం పట్ల గారేపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.