22-04-2025 12:45:16 AM
అచ్చంపేట ఏప్రిల్ 21: దినసరి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బిడ్డ జేఈ ఈ మెయిన్స్- 2025 ఫలితాల్లో ఆల్ ఇండి యా 132వ ర్యాంకు సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు గ్రామానికి చెం దిన గెలువయ్య దినసరి కూలీగా పనిచేస్తూ తన కుమారుడు ఆలేటి శీనును ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. నేపథ్యంలోనే జేఈ ఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు రావడంతో ఆ కుటుంబంలో సంతో షం వెలివేరిసింది.
ఆలేటి శ్రీను చిన్నతనం నుండి కడు పేదరికంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ వచ్చాడు. గతంలో కూడా లింగాల రెసిడెన్షియల్ పాఠశాలలో10 వ తరగతిలో మొదటి ర్యాంకు సాధించాడు ఎలాంటి కోచింగ్ తీసుకోకుం డా కేవలం పుస్తకాల ద్వారానే ఈ విధమైన ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉం దని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామ విద్యార్థి ఈ విధమైన ర్యాంకు సాధించి నందుకు తమకు గర్వంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు