calender_icon.png 10 January, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసుకి బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు

15-09-2024 08:42:00 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): అఖిలభారత ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, డిజిటల్ మీడియా, ట్రస్మా సంయుక్తంగా హైదరాబాదులో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ సెమినార్ లో జిల్లా కేంద్రంలోని సిసిసిలో గల ఆదిత్య హై స్కూల్ కరస్పాండెంట్ గోపతి సత్తయ్య  బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు. 32 సంవత్సరాలుగా కోల్ బెల్ట్ ప్రాంతంలో విద్యా సేవలు అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చి ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా విద్యా బోధన చేయడం వల్లనే ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ గా అవార్డు అందుకున్న గోపతి సత్తయ్యను ట్రస్మా నాయకులు,  ఉపాధ్యాయులు, మిత్రులు అభినందించారు .