16-04-2025 10:27:22 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన డిసిఆర్బి ఎస్సై గడ్డం ప్రవీణ్ కు ఎస్పి రోహిత్ రాజ్(SP Rohit Raj) ప్రశంసా పత్రం బుధవారం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన, నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశంలో భాగంగా, మార్చి నెలలో కోర్టులో పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్న, ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ కు ప్రశంస పత్రం అందించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, డి.సి.ఆర్.బి డిఎస్పీ ఎన్ మల్లయ్య స్వామి, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, డి.సి.ఆర్.బి సిబ్బంది ఎస్సై ప్రవీణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.