హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి) : పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశా రు. ఆ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌కు, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో వేర్వేరుగా వినతిపత్రాలు ఇచ్చారు. రెండేండ్లుగా బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీమాన్, ప్రశాంత్, కర్ణాకర్, నందీశ్వర్, శ్రీకాంత్పాల్గొన్నారు.