calender_icon.png 23 October, 2024 | 4:52 AM

ఉత్తమ సాగు విధానం రావాలి

23-10-2024 12:00:00 AM

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి :

2050 నాటికి తీవ్రస్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొనగలం. ఈ తరుణంలో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో మొత్తం ఆర్థిక వ్యవస్థను పెద్ద మొత్తంలో ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు సాగు రంగానికి ఉన్నాయి. 

వ్యవసాయ ప్రధానమైన భారతదేశానికి నిజానికి అదే శ్రీరామ రక్ష. కానీ, పాలకులు ఉత్తమ సాగు విధానాన్ని అవలంభించక పోవడం వల్ల దేశ వ్యాప్తంగా రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఆయా ప్రభుత్వాలు దీర్ఘకాలంగా ఈ రం గాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పర్యవసానాలను ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు.

రైతులకు తాత్కాలిక తాయిలాలు ఇస్తే సరిపోతుందా? ఒక మేలైన, భరోసానిచ్చే వ్యవ సాయ విధానం అవసరం లేదా? సామాన్యులనుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఆలోచించవలసిన అంశం ఇది. దేశానికి స్వాత్రంత్యం వచ్చిన ఏడున్నర  దశాబ్దాల తర్వాతైనా, ఒక సమగ్ర, సర్వసమర్థ వ్యవసాయ విధానం వైపు రైతులను నడిపించే ఆలోచన చేద్దాం.

వ్యవసాయం అంటే నామూషీగా పలువురి ఆలోచనలు తయారైన ఈ తరుణం లో సాగు రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ యావ త్ దేశ సౌభాగ్యానికి ఎంతైనా అవసరం. ‘లక్షాధికారియైన లవణమన్నమేగాని, మెరుగు బంగారంబు మింగబోడు..’ అన్నట్లుగా ప్రతి ఒక్కరూ జీవించాలంటే, నాణ్య మైన తిండి తినక తప్పదు.

నకిలీలు, రసాయనాల బారిన పడని పద్ధతిలో పూర్తి ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తివైపు ఇప్పటికైనా అందరం ఆలోచించాలి. ఈ దేశ పాలకులు వ్యవసాయాన్ని అన్ని విధాలా బాగు పరచడానికి కావలసిన తోడ్పాటును అందించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా, దేశవ్యాప్తంగా రోజురోజుకూ దిగజారిపోతున్న ‘వ్యవసాయ విధానం’ భవిష్యత్తులో ప్రజల పాలిట మరింత  పెను ప్రమాదకారి కాగలదన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. 

ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

ముఖ్యంగా నేటి యువతరం వ్యవసా యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీనికి కారణాలు అనేకం. అందరికీ వైట్ కాలర్ ఉద్యోగాలు, తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదన కావాలి. ఎండా వానలకు శరీరాలను అప్పజెప్పడానికి ఎవరూ ముందు కు రావడం లేదు. పోనీ, ప్రభుత్వ పరంగా వ్యవసాయం కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు లభిస్తున్నాయా అంటే అదీ లేదు.

ఓట్ల కోసం ఏవో మాఫీలు, తాయిలాలు అంతే. ఇప్పటికైనా, వ్యవసాయానికి ఒక పరిశ్రమ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పరచాలి. లేకపోతే, 2050 నాటికి తీవ్రస్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొనగలం. ఈ తరుణంలో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మన దేశంలో మొత్తం ఆర్థిక వ్యవస్థను పెద్ద మొత్తంలో ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు సాగు రంగానికి ఉన్నాయి. ఒక అంచనా ప్రకా రం, మొత్తం మీద వ్యవసాయ ఉత్పుత్తుల వాటా ఆర్థిక పరంగా 16 శాతం వరకూ ఉంటున్నట్టు అంచనా. భారతీయ జనాభాలో దాదాపు 52 శాతం మందికి ఉపాధి ఈ రంగం నుండే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తున్నది. ఇది ఆ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి.

సమగ్రాభివృద్ధికి మూలం

దేశవ్యాప్తంగా రైతులందరికీ మేలు చేసేలా ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని వేగవంతంగా అమలులోకి తేవడా నికి తక్షణం అందరూ పాటుపడాలి. ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించడానికి కూడా ఇది అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. హరిత విప్లవం తర్వాత భారతదేశంలో విస్తరణ సేవలలో అనేక మార్పులు సంభవించిన మాట వాస్తవమే.

అయినప్పటికీ, రైతుల విభిన్న అవసరాలు, సమస్యలకు పూర్తిగా పరిష్కారాలు లభించడం లేదు. భారతీయ జనాభాలో 70% మంది వ్యవసాయ సంబంధ పనులలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. ఆహార ప్రాసెసింగ్ కంపెనీల నుంచి వస్త్ర పరిశ్రమల వరకు అనేక పారిశ్రామిక, ఉత్పాదక విభాగాలకు ముడిసరుకు వ్యవసాయ రంగం నుండే వస్తుంది.

వ్యవసాయేతర రంగాలకు మూలవనరులు ఇక్కడ్నించే అందుతాయి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయాలుగా లేవన్నది గమనార్హం.

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. మొత్తం జనాభాలో మూడింట ఇద్దరు జీవనోపాధి కోసం వ్యవసాయ కార్యకలాపాలలోనే నిమగ్నమై ఉంటారు. ఇలా కోట్లాదిమంది ప్రజలకు వ్యవసాయం ఒక ప్రాథమిక కార్యకలాపమని చెప్పాలి. మనం తినే ఆహారం నుండి వివిధ ధాన్యాల వరకూ అన్నీ రైతుల జీవితాంత కృషి, భవిష్యత్తు, ఆరోగ్యాల త్యాగా లవల్లే ఉత్పత్తవుతాయి.

అనేక పరిశ్రమల మనుగడకు మూలం ఈ రంగమే. ఉదా   ॥కు: పత్తి, వస్త్ర, చక్కెర, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు.. ఇలా ఒకటేమిటి, అన్ని రకాల వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ఎగుమతి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటుంది. తద్వారా దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతూ ఉంటుంది.

జనాభాకు జీవనోపాధి కల్పించడంలో వ్యవసా యం వాటా 2001లో 63 శాతం వరకు కొనసాగినట్టు అంచనా. అయితే, ఇంత ప్రాధాన్యం ఉన్నప్పటికినీ పలు ప్రతికూల భౌగోళిక పరిస్థితులు, ఆయా రాజకీయ పరిణామాలవల్ల గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో అనిశ్చితి కొనసాగు తూనే ఉన్నది.

మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2025-2026 నాటికి ఆర్థిక లోటును 4.5 శాతానికి తగ్గించేందుకు ద్రవ్య స్థిరీకరణ బాటలో భారత్ ప్రయాణిస్తున్నది. వచ్చే ఏడాదికి 11.1 శాతం పెరుగుదలతో ఇది రూ.11,11,111 కోట్లకు చేరనున్నట్టు అంచ నా. 2023- 2024 ఆర్థిక సంవత్సరం మొద టి అర్ధభాగంలో  పరిశ్రమలు, సేవల రంగాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలిచాయి.

ఈ కాలంలో ప్రధానంగా అభి వృద్ధి చెందిన, చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో దేశం అత్యధిక ప్రగతిని నమో దు చేసింది. ఐఎంఎఫ్ ప్రకారం, మార్కెట్ మారకం రేటు మేరకు, 2027 నాటికి భారతదేశం అమెరికన్ డాలర్లలో ‘మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’గా మారే అవ కాశం ఉంది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 200 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా.  

కాబట్టి, ప్రాథమిక రంగంలో వ్యవసాయం ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు ద్వితీయ, తృతీయ రంగాలను ప్రగతి పథంలో వేగవంతంగా కొనసాగించడానికి, అసాధారణ అభివృద్ధికి కూడా వీలు ఏర్పడుతుంది. ఇలా దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ స్థాయిలో రైతులకు అంద రికీ పూర్తి భరోసా ఇచ్చేలా అత్యంత మెరుగైన వ్యవసాయ విధానాన్ని రూపొందిం చుకోవలసి ఉంది.

నిస్సందేహంగా భారతదేశంలో అతిపెద్ద జీవనోపాధి ప్రదాతగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పేర్కొనాలి. విశాలమైన గ్రామీణ ప్రాంతా ల్లో ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కూడా గణనీయ స్థాయిలో దోహద పడుతుంది.

సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి పరంగా, భూసార పరిరక్షణ, స్థిరమైన సహజ వనరుల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణం వంటి సాంకేతికతలు అన్నీ సమగ్ర గ్రామీ ణ అభివృద్ధికి అవసరం. భారతీయ వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు హరిత విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం, నీలి విప్లవానికి సాక్ష్యమిచ్చాయి. 

అత్యధిక ప్రాధాన్యం అవసరం

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వినియోగం, పెట్టుబడులకు బలమైన దేశీయ డిమాండ్ కారణంగా మూలధన వ్యయానికి ప్రభుత్వం నిరంతరం ప్రాధా న్యం ఇచ్చింది. పరిశ్రమలు, సేవల రంగాలు ప్రధాన వృద్ధి చోద కాలుగా నిలిచాయి. ఈ కాలంలో ప్రధా నంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే, ఇక్కడ వ్యవసాయ రంగం, పారిశ్రా మిక రంగం రెండూ కలిసి సహజీవనం వలె పని చేస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అత్యంత కీలకం అన్నది నిజం.అలాగని, వ్యవసాయానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనీ వాదించలేం.

వ్యవసాయం కూడా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి పారుదల, రవాణా మొదలైన ఇతర రంగాలపై ఆధారపడి ఉం టుంది. ఏదైనా ఒక రంగం దెబ్బ తిన్నట్లయితే, దాని పతనం స్పష్టంగా కనిపి స్తుంది. ఏది ఏమైనా, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వెన్నుదన్నుగా ఉపయోగప డుతున్న వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం.