calender_icon.png 18 November, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజ్ చేసిన కార్లు దగ్ధం

18-11-2024 04:05:14 AM

లంగర్‌హౌస్ పీఎస్ వద్ద వరుస ప్రమాదాలు
కార్వాన్, నవంబర్17: వాహన తనిఖీలతో పాటు వివిధ కేసుల్లో సీజ్ చేసిన కార్లను పోలీస్ స్టేషన్ సమీపంలోని రహదారి వద్ద పార్క్‌చేసి ఉంచగా.. అవి కాలిపోవడం కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. లంగర్‌హౌస్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వివిధ కేసులతో పాటు వెహికిల్ చెకింగ్‌లో వాహనాల పత్రాలు లేని సీజ్ చేసిన కార్లు, బైక్‌లను పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పార్క్‌చేసి ఉంచారు.
వాటిని చాలాకాలం అలాగే ఉంచడంతో చెత్తాచె దారం పేరుకుపోయింది. ఈనేపథ్యంలో శనివారం రాత్రి వాహనా లను నిలిపినచోట అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంట లు భారీగా వ్యాపించడంతో ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఓ కారు పూర్తిగా కాలిపోయిందని, నాలుగు కార్లు పాక్షింగా కాలిపోయాయని ఫైర్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దత్తు తెలిపారు.
లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌ను ఆనుకొని ప్రధాన రోడ్డుపై సీజ్ చేసిన వాహనాలను చాలాకాలంగా నిలిపి ఉంచడంతో ఆమార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వాహనాలను గోషామహల్‌కు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలుమార్లు అగ్ని ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.