calender_icon.png 28 April, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠ మ్యాచులో బెంగళూరు గెలుపు..

27-04-2025 11:21:52 PM

ఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్-18 లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) వేదికగా జరిగినా మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) 6 వికెట్ల తేడాతో విజయన్ని అందుకుంది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(51), కృనాల్ పాండ్య(73), టీమ్ డేవిడ్(19) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ 2, దుష్మంత చమీరా 1 వికెట్లు పడగొట్టారు. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కొల్పోయి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), కేఎల్ రాహుల్(41), స్టబ్స్(34), విప్రజ్ నిగమ్(12) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, హజిల్ వుడ్ 2, యశ్ దయల్ 1,  కృనాల్ పాండ్య 1 వికెట్లు తీసుకున్నారు.