calender_icon.png 27 April, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానంలో బెంగళూరువాసి మృతి

27-04-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 26: విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం. బెంగళూరు బిఎస్‌కే సెకండ్ ఫేజ్ పద్మనాభ నగర్ లో నివాసం ఉండే  వెంకటప్ప పద్మ తల్లి తులసమ్మ (76), పొరుగింటికి చెందిన మణిరాజుతో కలిసి ఉత్తర భారతదేశ పర్యటన కోసం ఇటీవల ఢిల్లీకి వెళ్లారు.

యాత్ర ముగించుకుని ఈనెల 25న వారణాసి నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6ఈ499 ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి సుమారు 11:30 గం టలకు తులసమ్మకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఎయిర్లైన్స్ సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేసి విమానా న్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు.  ఆమెను విమానాశ్రయంలోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే తులసమ్మ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమేరకు మృతురాలి కూతురు పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.