calender_icon.png 26 April, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సిక్సర్’ కొట్టిన బెంగళూరు

25-04-2025 12:50:59 AM

  1. 11 పరుగులతో రాజస్థాన్ ఓటమి
  2. నేడు హైదరాబాద్‌తో చెన్నై ‘ఢీ’

బెంగళూరు, ఏప్రిల్ 24: ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగ ళూరు 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70), పడిక్కల్ (27 బంతుల్లో 50) రాణించగా.. ఆఖర్లో జితేశ్ శర్మ (20 నాటౌట్) విధ్వంసంతో భారీ స్కోరు చేసిం ది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది.

జైస్వాల్ (49), ధ్రువ్ జురేల్ (47) మినహా మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ 4 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్‌లో సొంతగడ్డపై బెంగళూరుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. నేడు జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.