- క్వార్టర్స్‌లో ఒడిశాపై విజయంతో
- సంతోష్ ట్రోఫీ
హైదరాబాద్: దేశవాలీ టోర్నీ సంతోష్ ఫుట్‌బాల్ ట్రోఫీలో బెంగాల్ జట్టు 52వ సారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 3-1తో ఒడిశాను ఓడించింది. బెంగాల్ తరఫున నరోహరి శ్రేష్ట (45+2వ నిమిషంలో), రోబి హండ్సా (77వ ని.లో), మనొటొస్ (90+2వ ని.లో) గోల్స్ సాధించారు.
రాకేశ్ ఓరమ్ (25వ ని.లో) ఒడిశా జట్టుకు ఏకైక గోల్ అందించాడు. ఇప్పటివరకు 32 సార్లు సంతోష్ ట్రోఫీ కైవసం చేసుకున్న బెంగాల్ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలవడానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.