04-01-2025 11:03:09 PM
భువనేశ్వర్,(విజయక్రాంతి): హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో బెంగాల్ టైగర్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం లీగ్ దశలో భాగంగా ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 4 గెలుపొందింది. బెంగాల్ తరఫున జుగ్‌రాజ్ (ఆట 17వ, 38వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. సుఖ్‌జీత్ (1వ ని.లో), అభిషేక్ (47వ ని.లో) గోల్స్ సాధించారు. ఇక ఢిల్లీ జట్టుకు గారెత్ ఫర్లోంగ్ (53వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ 9 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్‌లో టీమ్ గొనాసికా 3 హైదరాబాద్ తుఫాన్స్‌పై విజయం సాధించింది. టీమ్ గొనాసికా తరఫున సునీల్ (2వ ని.లో), చార్లెట్ విక్టర్ (33వ ని.లో), నీలమ్ సంజీప్ (60వ ని.లో) గోల్స్ సాధించగా.. బ్రాండ్ టిమ్ (12వ ని.లో) హైదరాబాద్ తుఫాన్స్‌కు ఏకైక గోల్ అందించాడు. లీగ్ దశలో తొలి విజయాన్ని అందుకున్న టీమ్ గొనాసికా పట్టికలో మూడో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ తుఫాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.