calender_icon.png 4 January, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ టైగర్స్ విజయం

01-01-2025 11:50:05 PM

హాకీ ఇండియా లీగ్... 

రూర్కెలా: ఒడిశా వేదికగా జరుగుతున్న హీరో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నీలో బెంగాల్ టైగర్స్ రెండో విజయాన్ని అందుకుంది. బుధవారం రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో టీమ్ గొనాసికాపై 1 తేడాతో బెంగాల్ టైగర్స్ గెలుపొందింది. బెంగాల్ తరఫున రూపిందర్ (ఆట 31వ, 48వ నిమిషంలో) గోల్స్ సాధించారు. ఇక పెనాల్టీ కార్నర్ కింగ్‌గా పేరు పొందిన మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ ద్వారానే తన జట్టుకు ఏకైక గోల్ అందించాడు. వరుసగా రెండు విజయాలతో బెంగాల్ టైగర్స్ పట్టికలో తొలి స్థానంలో నిలవగా.. యూపీ రుద్రాస్, ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బెంగాల్ చేతిలో ఓటమితో టీమ్ గొనాసికా ఏడో స్థానంలో ఉండగా.. కళింగ లాన్సర్స్ చివరి స్థానంలో కొనసాగుతోంది.