calender_icon.png 3 March, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ మంత్రి కారు ధ్వంసం

01-03-2025 11:33:23 PM

జాదవ్‌పూర్ యూనివర్సిటీలో నిరసనలు..

విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు కారును ధ్వంసం చేసిన విద్యార్థులు..

రెండు గంటల పాటు నిర్భందంలో మంత్రి..

స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిక..

కోల్‌కతా: కోల్‌కతా నగరంలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, నక్సలైట్ ఏఐఎస్‌ఏ నేతలు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు కారును అడ్డుకుని విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు వీలైనంత తొందరగా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి క్యాంపస్‌లోకి రాగానే ఈ సంఘాల నిరసన ప్రారంభం అయింది. స్టూడెంట్‌లు నినాదాలు చేస్తూ వారి నిరసన తెలియజేశారు.

అనంతరం విద్యార్థి నాయకులు మంత్రి కారును వెళ్లనీయకుండా బ్లాక్ చేసి టైర్లలో గాలిని తీశారు. విద్యార్థులు మంత్రి కారు మీద దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో కారు అద్దాలతో పాటు బానెట్ కూడా డ్యామేజ్ అయింది. అందులో ఉన్న మంత్రిని దాదాపు రెండు గంటల పాటు ఎటు వెళ్లకుండా అడ్డగించారు. అనంతరం మంత్రి స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చేరారు.