calender_icon.png 19 April, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలోనూ బెంగాల్ తరహా పరిస్థితులు

19-04-2025 12:00:00 AM

  1. రేవంత్ సాయంతోనే వక్ఫ్‌బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన 
  2. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీల కుట్ర
  3. ఫోర్త్‌సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులూ కాజేసే యత్నం
  4. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సభలు, సమావేశాలు, ఆందోళనల పేరుతో అల్లర్లకు తెరలే పుతున్నారని వాపోయారు. ఇదే జరిగితే హైదరాబాద్‌లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్ప న్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు రేవంత్‌రెడ్డి సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నేషనల్ హెరా ల్డ్ కేసు విషయంలో బీజేపీకి ఏం సం బంధమేముందని ప్రశ్నించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కాజేసేందుకు యంగ్ ఇండియా ట్రస్ట్ పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర చేసిందని విమర్శించారు. పత్రిక ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునేందుకు చేసిన కుట్రకోణంపై 2012లో కేసు వేశారని తెలిపారు. దీనిపై 2013లో కోర్టు నోటీసుల ఆధారంగానే సీబీఐ విచారణకు ఆదేశించిందని స్పష్టం చేశారు.

అరెస్ట్ కాకుం డా బెయిల్‌పై ఉన్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అని.. ఆ కేసుతో మోదీ ప్రభుత్వానికి ఏం సంబంధమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలంతా ధర్నా చేయా ల్సింది ఈడీ ఆఫీస్ ముందు కాదని, ఆ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేసిన సోనియా గాంధీ నివాసమైన టెన్ జన్‌పథ్ ఎదుట అని ఎద్దేవా చేశారు.

ధర్నా సందర్భంగా ప్రధాని, కేంద్ర మంత్రి పట్ల గౌరవం లేకుండా బూతులు మాట్లాడిన కాంగ్రెస్ నేతలను ఏమనుకోవాలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి సమాధానం చెప్పాలన్నారు. యంగ్ ఇండియా పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకొని మనీ లాండరింగ్‌కు పాల్పడితే..

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియా బ్రాండ్.. ఫోర్త్ సిటీ పేరుతో వేలాది ఎకరాల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటూ రూ.50 వేల కోట్లను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 

వక్ఫ్ ఆస్తులకు లెక్కాపత్రం లేదు

రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తుల విలువ సుమా రు రూ.5 లక్షల కోట్లని.. ఇంత పెద్ద మొత్తం ఆస్తి కలిగి ఉన్నా, వీటి ద్వారా వస్తున్న ఆదాయానికి సంబంధించి లెక్కాపత్రం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఈ సొమ్ముతో ఒక్క పేద ముస్లిం జీవితాన్ని బాగుచేయలేదన్నారు. పైగా వక్ఫ్ ఆస్తులపై అనేక వివాదాలు న్నాయ ని.. కోర్టుల్లో 4 వేలకుపైగా కేసులున్నాయని.. కనీసం కౌంటర్ ఫైల్ చేయకుండా వక్ఫ్ బోర్డు కావాలనే ఆలస్యం చేస్తోందన్నారు.

ధరణి సమయంలో కూడా వేలాది ఎకరాల వక్ఫ్ భూము లు చేతులు మారాయని చెప్పారు. వక్ఫ్ ఆస్తులపై యేటా ఎంత ఆదాయం వస్తుంది.. ఆ సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు.. పేదల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.