calender_icon.png 26 March, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీర, రబ్బరు చెప్పులతో జాగింగ్

25-03-2025 11:51:03 PM

లండన్ వీధుల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..

లండన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయాల్లోనే కాదు రోజువారీ కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న దీదీ మంగళవారం స్థానిక హైడ్ పార్క్‌లో చీర, రబ్బరు చెప్పులతో నడకతో పాటు జాగింగ్ చేయడం ఆసక్తి కలిగించింది. భద్రతా సిబ్బంది వెంట రాగా మమత జాగింగ్ చేస్తున్న వీడియోనూ తృణముల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించే మమత అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా నడక, జాగింగ్ అవసరమని పలు సందర్భాల్లో సూచించారు. తన రోజువారి దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించే మమతా బెనర్జీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన అలవాట్లను అనుసరిస్తూనే ఉంటారు. గతంలో స్పెయిన్ సహా తదితర దేశాలకు వెళ్లినప్పుడు మమత ఇలాగే చీర, రబ్బరు చెప్పులతోనే జాగింగ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.