28-03-2025 12:39:06 AM
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి, మార్చి 27(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల అర్హులందరికీ లబ్ది చేకూరుతోందని కాంగ్రె స్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం మల్కాజిగిరి ఆనంద్ బాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, పిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్ర నాథ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బికే శ్రీనివాస్, గుండా నిరంజన్, రాందాస్, సంతోష్ ముదిరాజ్, బాబు సత్యనారాయణ, సంపత్ గౌడ్, ప్రవీణ్, వినోద్ యాదవ్, పంజా శ్రీనివాస్ యాదవ్, ఉమేష్ సింగ్, నయీమ్ ఖాన్, ఫరీద్, ఇస్తారి, ఆశా ప్రభ, రోజా రమణి, శారద, లాస్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.