calender_icon.png 26 October, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేకప్ చెడిపోకుండా ఉండాలంటే..

27-05-2024 12:25:21 AM

మహిళలకు మేకప్ వేసుకోవటమంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనవంతులు ప్రత్యేకంగా బొటిక్‌లకు వెళ్లి మేకప్ చేయించుకుంటే.. తక్కువ ఆదాయ వర్గాల్లోని మహిళలు ఇండ్లలోనే అందంగా మేకప్ వేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఎంత తక్కువలో తక్కువ ఐలైనింగ్, లిప్‌గ్లోసింగ్ లాంటివి మా త్రమే చేసుకొన్నా ముఖారవిందం లో వచ్చే కళే వేరుగా ఉంటుంది. అ యితే, ఎంత మేకప్ వేసుకొన్నా ఎం డకు బయటకు వెళ్లారంటే కాసేపటికే చెమటతో అది చెడిపోతుంది. బయ టి ప్రదేశాల్లో మేకప్‌ను కాపాడుకోవ టం మహిళలకు తలకు మిం చి భార మే. అయితే, ఈ చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మేకప్ ఎక్కువసమ యం ఉంటుందంటున్నారు నిపుణులు.

1. ముందుగా ముఖంపై అతిగా మేకప్ వేయటం మానేయమంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ విభాగుసైన్. అతిగా మేకప్ వేస్తే బయటకు వెళ్లగానే చెమటకు అది చెడిపోతుందని చెప్తున్నారు.

2. ఎంత మేకప్ వేసుకొంటే సరైనదో ముందుగా తెలుసుకో వాలని సూచిస్తున్నారు. 

3. పలుచగా మేకప్ వేసుకొంటే చాలాసమయం నిలిచి ఉంటుందని తెలిపారు. అయితే, మహిళల చర్మ లక్షణాలను బట్టి కూడా మేకప్ ఎంతసమయం ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.