calender_icon.png 21 February, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల గని.. చింత చిగురు!

01-05-2024 12:05:00 AM

చింత చిగురు.. తీపి, పులుపు, ఒగురు మిళితమై ఉండే అద్భుతమైన పోషకాలు కలిగిన ఆకు కూరగా చెప్పుకోవచ్చు. సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు చింత చెట్లు పూత దశకు వస్తుంటుంది. ఈ దశకు ముందు పాత ఆకులు రాలిపోతూ.. కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. వీటినే చింత చిగురుగా పేర్కొంటారు. అయితే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. చింత చిగురు వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఓసారి చూద్దాం..

1. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిండెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. చింత చిగురును వాడటం వల్ల ఒళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 

2.  చింత చిగురు ఆహారంలో భాగం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

3. దీంట్లో ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, టార్టారిక్ యాసిడ్స్ ఉంటాయి.  ఇవి జీర్ణక్రియ మెరుగుదలకు తొడ్పడతాయి. 

4. చింత చిగురును నీటిలో ఉడికించి, ఆ తర్వాత ఆ కషాయంతో పుక్కిలిస్తే పంటి, గొంతు నొప్పులు తగ్గుతాయి.