కాలం మారిపోయింది. ఒక నెల పరిచయమైతే రెండో నెలలోనే డేటింగ్‌కి వెళ్లి, మూడో నెలలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అలా పెళ్లి చేసుకున్న వారు త్వరగా విడిపోతున్నారు. ఆరు నెలలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. బంధం బలంగా ఉండాలంటే స్లో డేటింగ్ ఉత్తమం అంటున్నారు. స్లో డేటింగ్‌లో ఒకరికొకరు బాగా అర్థమవుతారు. ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి.
ఒకరి కుటుంబ గురించి మరొకరు తెలుసుకుంటారు. అలాగే లోటుపాట్లను కూడా అర్థం చేసుకుంటారు. కొత్త కుటుంబంలో ఇమడగలమో లేదో, ఆ వ్యక్తితో జీవించగలమో లేదో తేల్చుకుంటారు. అనుబంధం శాశ్వతంగా నిలవాలంటే మాత్రం సమయాన్ని తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఒకరిపై ఒకరికి పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది.